గత వైసీపీ ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను పూర్తిగా దెబ్బ తీసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఆలయ సంప్రదాయాలను ఆగమ శాస్త్రాలను గత ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మంటగలిపిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారికి శ్రీవారి దర్శక భాగ్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు.
తిరుమల గతంలో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందంటూ భక్తుల నుంచి ప్రశంసలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 5400 ఆలయాలకు దూప, దీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.5వేల నుంచి రూ.10 వేలకు పెంచామని తెలిపారు. భక్తులందరినీ ఫిర్యాదుల పుస్తకాన్ని అందుబాటులో ఉంచామని.. ఎవ్వరికైనా అసౌకర్యం కలిగితే భక్తుల సూచనలు సలహాలను స్వీకరిస్తున్నామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి స్పష్టం చేశారు.