బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ల వ్యాఖ్యలపై స్పందించనని.. వారిది తన స్థాయి కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వాళ్లు కేసీఆర్ కొడుకు, అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తను రైతు కుటుంబం నుంచి కింది స్థాయి నుంచి నాయకుడిని అయ్యానని చెప్పుకొచ్చారు.
“ముఖ్యంగా నా స్థాయి కి మాజీ సీఎం కేసీఆర్ వస్తానంటే గురుకులాలకు పోదాం” అని అన్నారు. కేటీఆర్, హరీశ్ రావు లాంటి పోరగాళ్లతో నేను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబందించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.