అనంతపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెట్టును ఢీకొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా విడపనకల్లు లో 42వ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెట్టును ఢీ కొంది కారు..కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురి మృతి చెందారు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉందని చెబు తున్నారు. ఈ తరుణంలోనే..గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం బళ్లారికి తరలించారు. బెంగుళూరు నుండి బళ్లారి కి వెళుతుండగా ఈ ప్రమాదం..చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు వైద్యులు..ఒక డ్రై వర్ ఉన్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మృతులు బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ లుగా గుర్తించారు పోలీసులు. దీనిపై ఇంకా వి వరాలు తెలియాల్సి ఉంది.