RGV భయపడి పారిపోయాడు..బుద్దా వెంకన్న ఫైర్

-

RGV భయపడి పారిపోయాడు అంటూ..బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇవాళ మీడియా సమావేశంలో జగన్, రాంగోపల్ వర్మల పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. రాంగోపాల్ వర్మ భయపడి పారిపోయాడని… గత ప్రభుత్వం సహకారంతో వర్మ ఇష్టం వచ్చినట్లు వాగాడని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను కించపరిచేలా సినిమాలు తీశాడని ఆగ్రహించారు. తన ట్విట్టర్లో మార్ఫింగ్ పోటోలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు… ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడని చురకలు అంటించారు.

budda venkanna slams rgv

నువ్వు దమ్ముగా ఉంటే.. నిలబడు.. నేను చేసింది కరెక్టు అని చెప్పు… నీకు నిజంగా సిగ్గుంటే.. ఆనాడు రెచ్చిపోయి.. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వంశీ, అవినాష్ ల గురించి సినిమా తీయరా అంటూ సవాల్‌ చేశారు. వర్మ సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది.. ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటని జగన్ అంటున్నాడన్నారు. జగన్ నీకు సిగ్గు బుద్ది ఉందా.. సీఎంగా చేసిన నువ్వు ఈ సినిమాల గురించి మాట్లాడతావా అంటూ ఆగ్రహించారు. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా….నువ్వు కూడా నీ తల్లి, చెల్లిని కూడా బయటకు పంపేశావు అంటూ నిప్పులు చెరిగారు. వివేకం సినిమా గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు…మరి ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news