తాడిపత్రి ఎవరి జాగీరు కాదు..మా పార్టీ నాయకులంతా వస్తారు…మా నాయకుడు జగన్ కూడా వస్తారు. తాడిపత్రి లోనే మీటింగ్ పెడతామని సవాల్ చేశారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి…. నా తల్లిదండ్రులు నన్ను సంస్కారంతో పెంచారన్నారు. నాలుగు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యే గా పనిచేశానని… నాపై ఆరోపణలు, దుర్భాషలు జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞతకు వదిలేస్తున్నా అంటూ ఫైర్ అయ్యారు.
తాటాకు చప్పులకు భయపడేదీ లేదు…దౌర్జన్మమే మీ సంస్కృతా జేసీ? నేను అవినీతి చేసుంటే… విచారణ చేసుకోవచ్చు అని తెలిపారు. 1985 నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి సంపాదించిన ఆస్తులపై విచారణ కు సిద్ధమా? నాకు సభ్యత ఉంది.. నేను తిట్టలేనని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు నేను భయపడనన్నారు. తాడిపత్రి ఎవరి జాగీరు కాదు..మా పార్టీ నాయకులంతా వస్తారు…మా నాయకుడు జగన్ కూడా వస్తారు. తాడిపత్రి లోనే మీటింగ్ పెడతామని తెలిపారు. అన్ని నియోజకవర్గాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.