ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో మంచి జరగాలని లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకుంటారు. అదృష్టం కూడా కలగాలని అనుకుంటారు. ఇంట్లో మంచి జరగాలన్నా ఏ సమస్య రాకుండా సంతోషంగా ఉండాలన్నా గవ్వలను పూజించాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. గవ్వలకి నిజానికి ఎంతో శక్తి ఉంటుందట. సముద్రం ఒడ్డున ఇది మనకి దొరుకుతాయి. గవ్వలను పూజ గదిలో ఉంచితే చాలా మంచి జరుగుతుందట. చాలా మంది ఇంటి గుమ్మాలకు కూడా పెట్టి అలంకరణగా వాడుతూ ఉంటారు. డబ్బులు పెట్టే పర్సు లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. హిందూ సంప్రదాయంతో పాటుగా చైనా శాస్త్రంలో కూడా వీటి గురించి ప్రస్తావించడం జరిగింది.
గవ్వలని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాగే శంఖాలను లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. గవ్వలని ఇంట్లో ఉంచడం వలన ధనం కలుగుతుంది. డబ్బుని నిల్వ చేసే చోట గవ్వలని ఉంచడం మంచిది. ఎక్కడైతే వీటిని పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట. గవ్వలని కళ్ళు ఉన్న ముఖం వైపు డబ్బులకి తగిలే విధంగా ఉంచితే మంచిదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పైగా వీటిని ఉంచిన చోట అదృష్టం వస్తుందట.
తెల్ల గవ్వల కంటే పసుపు రంగులో ఉండే గవ్వలు అన్నిటి కంటే శ్రేష్టమైనవట. మార్కెట్లో కొన్ని రకాల ప్లాస్టిక్ గవ్వలు కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి గవ్వలని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొనుగోలు చేయండి. పెళ్లి అవ్వాలంటే పెళ్లి కాని వాళ్ళు గవ్వలని ఉంచుకోవడం మంచిది. వారి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే త్వరగా పెళ్లి కుదురుతుంది. ఉద్యోగాలకు సంబంధించిన పనులపై బయటకు వెళ్లేటప్పుడు కూడా గవ్వలని దగ్గర పెట్టుకుంటే మంచి జరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది.