నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న హార్వెస్టర్‌ను బియ్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కట్టర్ సాయంతో క్యాబిన్ ముందు భాగాన్ని కట్ చేసి డ్రైవర్‌ను బయటకు తీశారు.డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆగి ఉన్న హార్వెస్టర్‌ను ఢీకొన్న లారీ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆగి ఉన్న హార్వెస్టర్‌ను ఢీకొన్న వరి ధాన్యంతో వెళ్తున్న లారీ నలుగురికి తీవ్ర గాయాలు కాగ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు లారీ డ్రైవర్ కట్టర్ సహాయంతో అతడిని బయటకు తీసిన పోలీసులు ఇరువురి పరిస్థితి విషమంగా ఉండడంతో… pic.twitter.com/rkrhA0qPW7
— ChotaNews (@ChotaNewsTelugu) December 2, 2024