ఏపీలో బిజేపీతో జతకట్టి.. అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆపార్టీతోనే రాజకీయ ప్రయాణం సాగించేలా ప్లాన్ చేస్తోంది.. తమ బలానికి బిజేపీ బలం తోడైతే.. మెరుగైన ఫలితాలను సాధించొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.. దీంతో తెలంగాణాలో కూడా కమలం పార్టీతో దొస్తి చేసేందుకు సిద్దమవుతోంది.. ఇంతకీ ఏ ఎన్నికల్లో టీడీపీ పోటీ చెయ్యతోంది..? పార్టీ పూర్వ వైభవానికి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలేంటో చూద్దాం..
తెలంగాణలో పార్టీని బలోపేతం చెయ్యాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.. సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో ఆ పార్టీ దూకుడు మీదుంది.. పార్టీ నుంచి వెళ్లిపోయిన సీనియర్లును తిరిగి పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు.. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు బాబూ మోహన్, తీగల కృష్ణారెడ్డి వంటి నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు.. బాబూ మోహన్ అయితే ఏకంగా పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు..
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.. అధికార కాంగ్రెస్ తో పాటు గ్రేటర్ లో బలంగా ఉన్న బీఆరెస్స్, బీజేపీ, ఎంఐఎం లు బరిలోకి దిగనున్నాయి. దీంతో బిజేపీతో కలిసి పోటీ చెయ్యాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. గతంలో ఘోరంగా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలో ఉండటంతో.. జీహెచ్ ఎంసీ ఎన్నికలపై గురి పెట్టింది.. బీఆర్ఎస్ తో పాటు బిజేపీని దెబ్బకొట్టాలని భావిస్తోంది..
వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా బరిలోకి దిగడంతో.. ఇప్పటి నుంచే ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఆంద్ర సెటిలర్స్ ఉన్న కూకట్ పల్లి, సనత్ నగర్, జూబ్లిహిల్స్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది.. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చాపకింద నీరులా పూర్వ వైభవం కోసం పావులు కదుపుతోంది.. టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బిజేపీ అంగీకరిస్తుందో లేదో చూడాలి..