తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన పలువురు ప్రస్తుతం పదవుల కోసం ఆయన చెంతకు చేరారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు కేబినెట్లోకి తీసుకోవాలని డీసీసీ అధికార ప్రతినిధఇ వెంకటేశ్ గౌడ్, బత్తుల అంజయ్య డిమాండ్ చేశారు.
మధుయాష్కి గౌడ్‌కి మంత్రి పదవి ఇవ్వకపోతే గాంధీభవన్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటారని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదిలాఉండగా, రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉండగా ఇప్పటికే పలుమార్లు పోస్టుపోన్ అయ్యింది. ప్రస్తుతం ఎన్నికలు సైతం లేకపోవడంతో త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.