వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి షాక్ తగిలింది. తిరుపతి చంద్రగిరిలో ఎంపి విజయసాయిరెడ్డి సతీమణి సునంద 2010లో కొనుగోళ్లు చేసిన స్థలంలో వివాదం నెలకొంది. పట్టా స్థలంలో స్వయంభూగా వెలసింది నాగదేవత. ఈ తరుణంలోనే.. శ్రీ నాగాలమ్మ దేవాలయం అభివృద్ది కమిటీ పేరుతో ఒంటి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు.
స్థల యజమాని విజయసాయిరెడ్డి సతీమణి అనుమతి లేకుండా ఆలయానికి గేట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి టిక్కెట్లు వసూళ్లు చేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం తన పేరుతో కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకున్నాడు ఒంటి శివశంకర్ రెడ్డి. నాగ ప్రతిష్ట, ప్రత్యేక పూజలు పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేస్తున్నాడని తెలుసుకున్నారు విజయసాయిరెడ్డి. ఈ తరుణంలోనే… శివశంకర్ రెడ్డి పై తన అనుచరులతో పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయసాయిరెడ్డి. ఫిర్యాదు చేయడంతో ఆలయం ఎదుట ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన సతీమణి సునంద ప్లెక్సీలు తొలగించాడు ఒంటి శివశంకర్ రెడ్డి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.