తిరుపతిలో ఉప్పొంగిన రొయ్యల వాగు.. ఇద్దరి గల్లంతు

-

ఏపీపై ఫెంగల్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే తిరుపతి సమీపంలో చిట్టమూరు మండలం రొయ్యల వాగు పొంగి పొర్లడంతో పంటపొలాలు, జనావాసాలు వరద ముంపునకు గురయ్యాయి. కొత్తగుంట వద్ద రొయ్యల వాగు వద్ద దాటే క్రమంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. కోట మండలం చెందిన మధు రెడ్డి , షారుక్‌లు ‌వాగు దాటే క్రమంలో వరధ ఉదృతిలో కొట్టుకుపోయారు.

గల్లంతైన ఇద్దరి కోసం చిట్టమూరు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక అటు చైన్నైలోనూ ఫెంగల్ తుఫాన్ భీభత్సం కొనసాగుతోంది. తిరువణ్ణామలైలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో శిథిలాల కింద ఏడుగురు చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు వారిని రక్షించే ప్రయత్నంలో చేరారు. అనంతరం అధికారులు చుట్టుు ప్కల గల గ్రామాలన్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news