నాలుగు విడతల్లో ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన భట్టి.. నాడు వమేము ఏ గ్రామంలో వెళ్లిన ఇందిరమ్మ ఇండ్లు చూపిస్తూ మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారన్నారు. నాటి ప్రభుత్వం డబుల్ బెడ్రమ్ ఇండ్లు పథకం ప్రవేశ 1.52 వేల టెండర్ పిలిచి 92 వేల ఇండ్లు సగం.. 62 వేల ఇండ్లు పూర్తి చేశారని తెలిపారు. నాటి బీఆర్ ఎస్ ప్రభుత్వం నిరు పేదలను విస్మరించింది….నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 లక్షల 56 వేల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టామమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
మిగిలిన ఇండ్లను ఇందిరమ్మ ప్రభుత్వం పూర్తి చేస్తుందని… పేద వాడి చిరు ఆశ.. చివరి ఆశ ఇండ్లు అని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇండ్లు, ప్రతీ ఇంటికి 5 లక్షల రూపాయలు.. 400 చదరపు అడుగుల ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. నాలుగు విడతల్లో ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని.. ప్రజాపాలనలో లక్షలాది దరఖాస్తులు వచ్చాయని వివరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రేపట్నుంచి ప్రతీ గ్రామానికి అధికారులు వెళ్లి సర్వే చేస్తారు….ఎవరు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్క పైసా ఇవ్వొద్ద న్నారు. అర్హులైన పేదలకు ఇండ్లు ఇస్తాం… పార్టీలకు అతీతంగా ఇండ్లు ఇస్తామని తెలిపారు.