ఉమ్మడి ఆదిలాబాద్లో చిరుత పులి సంచారం జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో పులులు, చిరుతల సంచారం అధికమైంది. గత 5 రోజుల క్రితం ఓ మహిళ పులి దాడిలో మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పులులు వరుసగా దాడులు చేస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ చిరుత పులి ఫ్లై ఓవర్పై గాండ్రిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. పులి కూర్చుని ఉండగా అటుగా వెళ్తున్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చిరుత పులి అక్కడ ఉన్నదనే విషయం గుర్తించక అటుగా వెళ్తున్న బైకర్ దానిని గమనించి వెంటనే యూటర్న్ చేసుకుని తిరిగి వెళ్లిపోయారు. ఇక బస్సులో వెళ్తున్న ప్యాసింజర్స్ పులిని చూసి భయాందోళనకు గురయ్యారు.
ప్లై ఓవర్పై పులి.. హడలిపోయిన వాహనదారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులి భయపెడుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఉమ్మడి జిల్లాలో పులులు, చిరుతల సంచారం అధికమైంది. 5రోజుల క్రితం ఓ మహిళ పులి దాడిలో చనిపోగా, మరో వ్యక్తి గాయపడ్డారు. పులులు దాడులు చేస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఈ… pic.twitter.com/9hNT43rvbn
— ChotaNews (@ChotaNewsTelugu) December 6, 2024