ఏపీ సర్కార్ ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకం అందిస్తున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో జరిగే డీప్‌టెక్ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందన్నారు. సాంకేతికతలో అనేక నూతన మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజలందరి జీవితంలో సాంకేతికత ఓ భాగంగా మారిందని, భారత్‌లో ఆధార్ సాంకేతికతలో ఘననీయమైన అభివృద్ధిని సాధించినదన్నారు.ఇక మీదట రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీలో కూటమి సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోందని, పెట్టుబడుల సమీకరణకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.