కుప్పంలో పుష్ప 2 కు బిగ్ షాక్ తగిలింది. థియేటర్లు మూసివేశారు. చిత్తూరు జిల్లా.. కుప్పంలో లక్ష్మి, మహాలక్ష్మి థియేటర్లకు నోటీసులు అందజేసి, తాళాలు వేశారు రెవెన్యూ అధికారులు. సినిమా థియేటర్ల లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా సినిమాలు ఆడిస్తుండటంతో రెవెన్యూ అధికారులు తాళాలు వేసినట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు పుష్ప-2 సినిమా వేసిన థియేటర్ కు తాళాలు వేయడంతో మండిపడుతున్నారు అల్లుఅర్జున్ అభిమానులు. టీడీపీ సీనియర్ నేతకు చెందిన రెండు ధియేటర్లకు తాళాలు వేయడంపై పట్టణంలో తీవ్రంగా చర్చనీయాంశం మారింది ఈ వివాదం. ఇక అటు ఈ సినిమాను డిసెంబర్ 04న ప్రీమియర్స్ వేశారు. తొలిరోజు ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వచ్చాయి. పుష్ప-2 కి సినిమాకి సంబంధించి తొలి రోజు రూ.294 కోట్ల కలెక్షన్లు వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. భారత సినీ చరిత్రలోనే ఇదే అత్యధికం అంటూ పేర్కొంది.