కడప జిల్లాలో దారుణం…షర్మిలపై కత్తితో దాడి !

-

కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది…షర్మిలపై కత్తితో దాడి చేశాడు ఓ యువకుడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. కడప జిల్లా వేముల కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షర్మిల అనే యువతిపై కత్తితో దాడి చేశాడు కుళ్లాయప్ప అనే యువకుడు. పరిస్థితి విషమించడంతో యువతిని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.

A young man named Kullayappa attacked the young woman with a knife

బాధితురాలి శరీరంపై 11 కత్తిపోట్లు ఉన్నాయని వైద్యు లు గుర్తించారు. యువకుడు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కొంతకాలంగా యువతిని ప్రేమించమని వేధించేవాడని.. ఈ క్రమంలోనే ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news