ఐ యామ్ సారీ..నేను రాలేను : మంత్రి పొన్నంకు కిషన్ రెడ్డి లేఖ

-

తెలంగాణ సచివాయంలో ఈ నెల 9న సోమవారం నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు తాను రాలేనని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్ది తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాలేకపోతున్నట్లుగా కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, ప్రత్యేక గుర్తింపు, పోరాటానికి ప్రతీకగా అభివర్ణించారు.విగ్రహావిష్కరణకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలాఉండగా, రేపు సెక్రెటేరియట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news