Sridhar Babu: తెలంగాణకు గుడ్ న్యూస్..1500 కోట్లతో లెన్స్ కార్ట్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. తాజాగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వంతో పలు సంస్థల ఒప్పందాలు జరిగాయి. 1500 కోట్లతో లెన్స్ కార్ట్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.
సీతారాం పూర్ లో సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ ఒప్పందం జరిగింది. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వంతో MoU కుదుర్చుకుంది ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇక అటు మీ సేవ మొబైల్ యాప్ ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. దీంతో ఇక పై మరో 9 సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మీ సేవ మొబైల్ యాప్ ను ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు..మొబైల్ లోనే మీ సేవ సర్వీసులు పొందేలా యాప్ రూపకల్పన చేయించారు. మీ సేవలో మరో తొమ్మిది రకాల సర్వీసులను యాడ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.