BREAKING: కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో BRSLP సమావేశం ప్రారంభం అయింది. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు BRS అధినేత కేసీఆర్.
ఈ మేరకు ఇప్పటికే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ కుమార్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపి వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు అయ్యారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కూడా వచ్చారు.