కేసీఆర్.. మీ పిల్లలకు మర్యాద నేర్పించు.. టీ షర్ట్ లతో తిరుగుతున్నారు – కోమటిరెడ్డి

-

బీఆర్ఎస్ నాయకుల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీ శీతకాల సమావేశాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఈ విషయాన్ని శాసనసభలో ప్రతిపక్ష నేత స్వయంగా ప్రకటించారని తెలిపారు.

తెలంగాణ ప్రకటన రోజు.. నాలుగు కోట్ల ప్రజల కోరిక నెరవేర్చిన రోజు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజున ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. “కేసీఆర్.. మీ పిల్లలకు మర్యాద నేర్పించు. రోడ్లమీద టీ షర్టులతో లొల్లి పెడుతున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ బయట పిచ్చి వేషాలు వేస్తున్నారని.. తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం కార్యక్రమంలో ప్రతిపక్షాలు తమ పాత్ర పోషించాలన్నారు.

కాంగ్రెస్ పార్టీలో తప్ప రాష్ట్రంలో ఏ పార్టీలోనూ తెలంగాణ పదం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కెసిఆర్ తన పార్టీలో టీ తీసేసి బీ పెట్టుకున్నారని అన్నారు. దీంతో తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజున కెసిఆర్ కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు అంటే.. వేల పుస్తకాలు చదివి ఏం లాభం అన్నారు మంత్రి కోమటిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news