తెలంగాణలో ఎల్లమ్మ, పోచమ్మ ,మైసమ్మ, అమ్మవార్ల విగ్రహాల ప్రతికంగా తెలంగాణ తల్లి నిలుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈరోజు ఏర్పాటు చేసుకునే తెలంగాణ తల్లి విగ్రహం మన పోరాటాలకు, మన సంస్కృతికి, త్యాగాలకు ప్రతిరుపకంగా ఉన్నదని తెలిపారు.
వ్యవసాయం ప్రధానంగా ఉండే ఈ సమాజంలో నిత్యం వ్యవసాయంలో తలమునకలై ఉండే మహిళలు ఇందులో ప్రతిబింబిస్తున్నారు..తెలంగాణ పోరాటానికి వారసత్వంగా కనిపిస్తోందని పేర్కొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోదండరాం. తెలంగాణ తల్లిని తొలుత ఇదే రూపంలో రూపొందించామని… తెలంగాణ తల్లి విగ్రహం నిరండంబరంగా ఉందని పేర్కొన్నారు. ఇంత మంచి విగ్రహం రూపొందించినందుకు కళాకారులకు, ప్రతిష్టిస్తునందుకు ప్రభుత్వానికి అభినందనలు చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోదండరాం.