ఆంధ్రప్రదేశ్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. సంక్రాంతి పండుగ కానుకగా మహిళల కోసం ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతుందట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు… సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుందని… ఈ పోస్టులో టిడిపి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొనడం జరిగింది.
ఉచిత బస్సు ప్రారంభమైన తర్వాత… బస్సుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే ఉచిత బస్సు అమల్లోకి వస్తే ఆటో కార్మికులను ఆదుకునేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించాడు. దీంతో సంక్రాంతికి ఖచ్చితంగా ఏపీలో ఉచిత బస్సు ప్రారంభం కాబోతుందని వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా దీపావళి లేదా దసరా సమయాల్లోనే ఫ్రీ బస్సు ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ… అప్పుడు ఈ పథకాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు సంక్రాంతి పండుగ కానుకగా పథకం ప్రారంభం కాబోతున్నట్లు తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.