జబర్దస్త్ కామెడీ షో గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు. అందులో నటించే ఆర్టిస్టులతో పాటు జడ్జిలకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతంలో నాగబాబు- రోజా కాంబినేషన్ చాలా సక్సెస్ అయ్యింది.అటు ఆ షోలో చేస్తూనే రోజా నగరి ఎమ్మెల్యేగా, గత వైఎస్సార్‌సీపీ టర్మ్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రి పదవి వచ్చే వరకు ఆమె జబర్దస్త్ షోలో జడ్జిగా పనిచేశారు. ఆ తర్వాత షో నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం నాగబాబు సైతం ఆ షో నుంచి తప్పుకుని జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. నాగబాబు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదు. ఎమ్మెల్యే కాకుండానే నేరుగా మంత్రి పదవి ఆయనకు వరించనుంది. మంత్రిగా ప్రమాణం చేశాక ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎంపిక కావాల్సి ఉంటుంది. మరీ సీఎం చంద్రబాబు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.