ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరులో రహదారిపై నుంచి వెళుతున్న కారును ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం అందులోని ప్రయాణికులను కిందకు దింపారు. ఆ తర్వాత కారుకు నిప్పంటించారు. మావోయిస్టుల చర్యలను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారో మాత్రం ఇంకా తెలియరాలేదు. అదృష్టవశాత్తు ప్రయాణికులు ప్రాణాలతో బయపడ్డారు. కారు మొత్తం పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధిత ప్రయాణికులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సైతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
👉అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు
👉చింతూరులో రోడ్డుపై వెళుతున్న కారును ఆపి.. ప్రయాణికులను దింపారు. అనంతరం కారుకు నిప్పు పెట్టారు.
👉మావోయిస్టుల చర్యలను ప్రత్యక్షంగా చూసిన కారులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు…. pic.twitter.com/gUXfLK05qd
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024