శరీరంలో వింటమిన్ B12 లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

-

విటమిన్ బి12.. దీన్ని కోబ్లామిన్ అని కూడా అంటారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి12 చాలా అవసరం. అలాగే నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే బి12 కావాలి. అయితే దీన్ని మన శరీరం డైరెక్ట్ గా ఉత్పత్తి చేయలేదు, కాబట్టి కచ్చితంగా బయట నుండి తీసుకోవాలి.

విటమిన్ బి12 స్థాయిలు శరీరంలో తగినంతగా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం.

తీవ్రమైన అలసట:

ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి12 సాయపడుతుందని చెప్పుకున్నాం. విటమిన్ బి 12 తగినంతగా లేకపోతే ఎర్ర రక్త కణాలు సరిగ్గా పనిచేయవు. ఇవి శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ ని అందజేస్తాయి. ఇవి తగినంత ఉత్పత్తి కాకపోవడం వల్ల శరీరకణాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఆ కారణంగా ఏమి చేయకపోయినా అలసటగా అనిపిస్తుంది.

మతిమరుపు:

బి12 లోపం ఉన్నవాళ్లు మతిమరుపు సమస్యను ఎదుర్కొంటారు. చిన్న చిన్న విషయాలను మర్చిపోవడం జరుగుతుంది. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే బి12 ఖచ్చితంగా కావాలి. దానిలోపం వల్ల మెదడు చురుకుగా ఉండదు.

కంటి చూపు తగ్గిపోవడం:

కొన్ని కొన్ని సార్లు విటమిన్ b12 లోపం కారణంగా కంటిచూపు తగ్గిపోతుంది. మసక మసకగా వస్తువులు కనిపిస్తాయి.

తరచుగా నోటిపూత సమస్య:

నోట్లో పగుళ్ళు ఏర్పడటం వంటి సమస్యకు కూడా బి12 లోపమే ఒక్కోసారి కారణం అవుతుంది. కొన్ని కొన్ని సార్లు నోటిపూత వల్ల నాలుక ఉబ్బిపోయి ఎర్రగా కనిపిస్తుంటుంది. తినడానికి ఇబ్బందిగా అనిపిస్తూ మాట్లాడటానికి కష్టంగా ఉంటుంది.

సరిగ్గా నడవలేకపోవడం:

బి12 లోపం ఏర్పడితే నేల మీద బ్యాలెన్స్ సరిగ్గా ఆగక నడక తడబడుతుంటుంది. ఇంకా చర్మం తెల్లగా పాలిపోవడం, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వీలైనంత తొందరగా డాక్టర్ ని కన్సల్ట్ అవటం మంచిది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news