హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మోహన్ బాబు ఫోటో ఒకటి వైరల్ గా మారింది. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మోహన్ బాబుకు వైద్యం అందిస్తున్నారు డాక్టర్స్. కాగా నిన్న మోహన్ బాబుకు అస్వస్థత నెలకొంది. దింతో మోహన్ బాబు ను ఆసుపత్రికి తరలించారు.
బీపీ ఎక్కువ కావటంతో మోహన్ బాబును స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇక అటు మోహన్‌బాబుకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
కాగా, నిన్న రాత్రి జల్ పల్లి మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్ గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు. మనోజ్ తో పాటే మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్లారు.
హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మోహన్ బాబు pic.twitter.com/VaVTKqL6An
— ChotaNews (@ChotaNewsTelugu) December 11, 2024