ఏపీ హోంమంత్రి అనితకు శుభవార్త.. ఆ కేసు కొట్టివేత!

-

ఏపీ హోంమంత్రి అనితకు భారీ ఊరట లభించింది. గతంలో ఆమె మీద నమోదైన చెక్ బౌన్స్ కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. గతంలో వేగి శ్రీనివాస రావు వేసిన పిటిషన్‌పై మంగళవారం వర్చువల్‌గా విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కృపా‌సాగర్ ఇరు పక్షాల వాదనలు విన్నారు. హోంమంత్రి అనిత, శ్రీనివాస రావు ఈ కేసులో రాజీ పడ్డట్లు న్యాయమూర్తికి వివరించారు. దీంతో జస్టీస్ కృపా‌సాగర్ వైజాగ్ ఏడో స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులోని కేసును కొట్టేయొచ్చా అని వారిని ప్రశ్నించగా.. అందుకు పిటిషనర్ శ్రీనివాస‌ రావు ఓకే చెప్పారు.

పిటిషనర్‌కు ఇప్పటికే రూ.10 లక్షలు ఇచ్చామని, మరో రూ.5 లక్షలను చెక్కు రూపంలో ఆయన తరఫు లాయర్‌కు హైకోర్టులో అందజేశామన్నారు.దీంతో హోంమంత్రి అనితపై చెక్ బౌన్స్ కేసును కొట్టివేస్తూ జస్టిస్ కృపాసాగర్ తీర్పును వెల్లడించారు. కాగా, 2015లో అనిత తన వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారని, 2018లో డబ్బు తిరిగి చెల్లించే క్రమంలో ఆమె ఇచ్చిన చెక్కు చెల్లలేదన్నారు. దీంతో శ్రీనివాసరావు 2019లో వైజాగ్‌లోని ఏడో స్పెషల్ మేజిస్ట్రేట్‌ కోర్టులో చెక్‌బౌన్స్‌కు సంబంధించి పిటిషన్‌ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news