రాష్టంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అసెంబ్లీ వ్యవహారాలు, క్వశ్చన్ అవర్, వాయిదా తీర్మానాలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బుధ, గురువారాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ ఆర్డీలో ఈ ప్రోగ్రాం జరగనుంది. మంగళవారం ఈ ట్రైనింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యలు, ఎంసీహెచ్ఆర్డీ డీజీ, స్పెషల్ సీఎస్ శశాంక్ గోయల్ పరిశీలించారు.
ఇదిలాఉండగా, ఎమ్మెల్యేల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌ను బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.అసెంబ్లీ ప్రారంభానికి ముందే తమ హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని, మొదటిరోజు సభలోనికి రాకుండా పోలీసులుతో అరెస్టు చేయించారని మండిపడ్డారు.