ఆస్తి తగాదాల నేపథ్యంలో కుటుంబ హత్యలు, కలహాలు రాష్ట్రంలో క్రమంగా పెరిగిపోతున్నాయి. తాతల కాలం నాటి ఆస్తులపై అన్నదమ్ములు, వారి కొడుకులు కొట్లాటలకు దిగుతున్నారు. తాజాగా భూవివాదంలో అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో నరుక్కున్నారు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నది.
ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. సమాచారం అందుకున్న తిప్పర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.గజ్జి లింగయ్య కుటుంబ సభ్యులు తమపై దాడి చేశారని గజ్జి చంద్రయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
భూవివాదంలో అన్నదమ్ముల పిల్లలు గొడ్డలితో నరుక్కున్నారు.
ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న తిప్పర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ్జి లింగయ్య కుటుంబ… pic.twitter.com/4SiZ5urEov
— ChotaNews (@ChotaNewsTelugu) December 11, 2024