మోహన్ బాబు అనుచరులు దాడి.. మరో రిపోర్టర్ కర్ణభేరికి రంధ్రం !

-

మోహన్ బాబు అనుచరులు దాడిలో మరో రిపోర్టర్ కర్ణభేరికి రంధ్రం పడింది. మోహన్ బాబు అనుచరులు దాడి చేయడంతో మీడియా ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి శివారులో శ్రీ విద్యానికేతన్ కాలేజీ ముందు మోహన్ బాబు అనుచరులు దాడి చేయడంతో నరసింహ అనే మీడియా ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు.

Mohan Babu’s followers attack Another reporter Karnabheri has a hole

అతని కర్ణభేరికి రంధ్రం పడినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అతనికి ఆపరేషన్ చేయాలని సూచించారు.అటు మంచు మోహన్ బాబు నిన్న రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధిపై దాడి చేశారు మంచు మోహన్ బాబు. అయితే ఈ ఘటనలో గాయపడిన జర్నలిస్టు పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు తీవ్ర గాయాలు అయినట్లు వైద్యులు చెబుతున్నారు. అతని ముక్కుకు అలాగే చెవికి మధ్య మూడు చోట్ల ఎముక ఫ్యాక్చర్ అయినట్లు… వైద్యులు చెప్పినట్లు సమాచారం అందుతోంది. దీంతో అతనికి సర్జరీ కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news