వినయ్… మా నాన్నకు మొదటి బిడ్డ.. నాకు అన్న అని పేర్కొన్నారు విష్ణు. వినయ్ మా నాన్నకు మొదటి బిడ్డ లాంటి వారు, నాకు అన్న లాంటి వారు.. ఆయన్ని కొట్టే ధైర్యం ఎవరూ చేయరన్నారు. మా యూనివర్సిటీ ఓపెన్ బుక్ లాంటిది.. దేవాలయం లాంటి యూనివర్సిటీపై తప్పుగా మాట్లాడడం సరికాదని చెప్పారు.

మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉందంటే అది మా ముగ్గురిని అతిగా ప్రేమించడం.. లక్ష్మి, నాకు కూడా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయని తెలిపారు. ఫస్ట్ కుటుంబం ముఖ్యం అనుకున్నాను..నిన్న ఒక జర్నలిస్టు కి గాయాలు అయ్యాయని చెప్పారు. చాలా దురదృష్టకరం..దానికి చింతిస్తున్నామన్నారు. నిన్న తండ్రిగా ఆయనా తపన చూడండి..దండం పెడుతూ మీడియా ముందుకు వస్తుంటే ఆయనకి లోగో మొహం మీద పెట్టారు అని కోపం తో అలా చేశారని క్లారిటీ ఇచ్చారు. అలా జరిగి ఉండకూడదని చెప్పారు. ప్రేమ తో గెలవాల్సింది… కానీ గొడవలు మార్గంగా ఎంచుకున్నారు..పొట్ట చించుకుంటే… పేగులు బయటపడతాయని చెప్పారు. నేను నా కుటుంబం గురించి బయట మాట్లాడను అని వివరణ ఇచ్చారు.