హైదరాబాద్ నగర శివారులోని శంషాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రైవేట్ వ్యక్తులు బయటకు వెళ్లిపోవాలని మనోజ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే మంచు విష్ణు జోక్యం చేసుకొని ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవ్వరూ లేరని బదులు ఇచ్చారు. మనోజ్ కి సంబంధించిన వ్యక్తులు కూడా బయటికి వెళ్లాలని విష్ణు వారికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇక్కడ మళ్లీ ఏం జరుగుతుందోననే ఉత్కంట నెలకొంది.
ఈ నేపథ్యంలో మనోజ్ ఇల్లు ఖాలీ చేయకపోతే తాను రంగంలోకి దిగుతానని మంచు విష్ణు పేర్కొన్నారు. మరోవైపు మోహన్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనను మనోజ్ వెళ్లి పరామర్శించినట్టు సమాచారం. మంచు మనోజ్ పై దాడి కేసులో కిరణ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్ ను అరెస్ట్ చేశారు పహడి షరీఫ్ పోలీసులు. మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. ఇక మరో నిందితుడు వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు.