తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. ఇక ఈ వర్షానికి ఇబ్బందులు పడుతున్నారు తిరుమల శ్రీవారి భక్తులు. ఘాట్ రోడ్డులలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచనలు చేశారు.
కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండడంతో అప్రమత్తమైన సిబ్బంది… పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేసింది. ఇక అటు ఇవాళ దర్శనాలకు 06 గంటల సమయం పడుతోంది. తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 65, 887 మంది భక్తులు దర్శించుకున్నారు.
- తిరుమల..15 కంపార్టుమెంట్లలో వేచి వున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనాని కి 06 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65887 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 25725 మంది భక్తులు
- హుండి ఆదాయం 3.88 కోట్లు