అల్లు అర్జున్ అభిమానులు, కుటుంబ సభ్యులకు శుభవార్త. కాసేపట్లో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టు అయిన నటుడు అల్లు అర్జున్ ఇవాళ (శనివారం) విడుదల కానున్నారు. వాస్తవానికి నిన్ననే అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
రూ. 50వేల పూచీకత్తు చెల్లించాలని తెలిపింది. కానీ, బెయిల్ ఉత్తర్వుల కాపీ చంచల్ గూడ జైలు అధికారులకు ఆలస్యంగా అందాయి. దీంతో శుక్రవారం రాత్రి అంతా జైలులోనే అర్జున్ ఉండాల్సి వచ్చింది.
ఇక… నిన్న ఒక్కరోజు చంచల్గూడా జైల్లో అల్లు అర్జున్ ఉన్న నేపథ్యంలో… ఆయనకు అండర్ ట్రయల్ ఖైది నెంబర్ 76 97 ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న రాత్రి జైల్లో ఉన్న అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ లో ఉండటం జరిగింది. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్లోనే ఉంచారు. ఆ తర్వాత సమయం పూర్తికాగానే మంజీరా బ్యారక్ లోకి పంపించారు. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం ఏడు గంటల తర్వాత విడుదల చేస్తారు.