ఈరోజు జైల్లోనే ఉండనున్న అల్లు అర్జున్.. క్యాబ్‌ లో వెళ్లిన అరవింద్..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఈరోజు జైలులోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. అల్లు అర్జున్ బెయిల్ కాపీ సరిగ్గా లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి టీ, స్నాక్స్ అందించారు జైలు అధికారులు. ఇంకా ఆన్ లైన్ తీర్పు కాపీ అప్ లోడ్ చేయలేదంటున్నారు జైలు అధికారులు. క్లాస్-1 బ్యారక్ సిద్ధం చేశారు జైలు అధికారులు.

రాత్రి 10 గంటల వరకు మాత్రమే సూపరింటెండెంట్ అందుబాటులో ఉంటానని చెప్పాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ మంజీరా బ్యారక్ లో ఉన్నారు. అల్లు అర్జున్‌ విడుదల ఈ రోజు లేనట్లే..? అని జైలు అధికారులు చెప్పడంతో  సాధారణ ఇండికా క్యాబ్‌ బుక్‌ చేసుకుని వెళ్లిపోయాడు అల్లు అరవింద్‌. చాలా అసహనంగా చంచల్‌గూడ జైలు నుంచి వెళ్లిపోయాడు అల్లు అరవింద్‌.

Read more RELATED
Recommended to you

Latest news