రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్‌కు మరక అంటించిన ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనమే అంటూ బాంబ్ పేల్చారు రచయిత చిన్నికృష్ణ. అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చుసిన ఏ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతారన్నారు గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
కాగా, చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల అయిన తర్వాత…. సొంత వాహనంలో వెనక గేటు నుంచి వెళ్లారు. అల్లు అర్జున్ కు ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి పంపారు అధికారులు. కాసేపట్లో ఇంటికి చేరుకోనున్నారట అల్లు అర్జున్. రాత్రి బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఉదయం విడుదల అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది హై కోర్టు.
అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చుసిన ఏ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతారు – గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ pic.twitter.com/WqsnHYpDsI
— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024