సినీనటుడు అల్లు అర్జున్ ఆలస్యంగా విడుదల కావడానికి పోలీసులే కారణమని, కావాలనే ఆలస్యం చేశారని అల్లు అర్జున్ తరఫు అడ్వొకేట్ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. స్టార్ హీరోను ఆలస్యంగా రిలీజ్ చేయడంపై తాము లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని తెలిపారు. వెంటనే రిలీజ్ చేయాలని హైకోర్టు మధ్యంతర బెయిల్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్ చేశారని ఆరోపించారు.
ఉద్దేశపూర్వకంగా రాత్రంతా అధికారులు జైల్లో ఉంచారని ఫైర్ అయ్యారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పారు. ఇదిలాఉండగా, నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టు అల్లుఅర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా..హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అప్పటికే చంచల్ గూడ జైలుకు వెళ్లిన బన్నీని తమకు కోర్టు బెయిల్ ఆర్డర్స్ ఆలస్యంగా వచ్చాయని అల్లుఅర్జున్ను పోలీసులు జైలులో ఉంచిన విషయం తెలిసిందే.
పోలీసులు కావాలనే ఆలస్యం చేశారు: అల్లు అర్జున్ అడ్వకేట్
సినీనటుడు అల్లు అర్జున్ ఆలస్యంగా రిలీజ్ అవ్వడంపై తాము లీగల్‌గా ప్రొసీడ్ అవుతామని ఆయన తరఫు అడ్వకేట్ అశోక్ రెడ్డి అన్నారు. వెంటనే రిలీజ్ చేయాలని మద్యంతర బెయిల్ ఆదేశాలు స్పష్టంగా ఉన్న కావాలనే పోలీసులు బెయిల్ ప్రోసిడింగ్స్ లేట్… pic.twitter.com/LChMuqCq13
— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024