ఆస్పత్రిలోని నర్సులు, సిబ్బంది రోగులను అస్సలే పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో మునిగి తేలారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మీడియా రాకను గుర్తించిన సిబ్బంది వెంటనే నృత్యాలు ఆపేశారు.
పేషేంట్ల రూమ్ పక్కనే నృత్యాలు చేస్తున్నట్లు వీడియాలో కనిపిస్తున్నా ఆస్పత్రి ఆర్ఎంఓ సుమన్, సిబ్బంది తమ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత స్టాఫ్ రిక్వెస్ట్ చేయటంతో అనుమతించామని ఆర్ఎంవో సుమన్ స్పష్టంచేశారు. ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి ఆస్పత్రిలో విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రోగులను వదిలేసి నృత్యాలు చేస్తున్న నర్సులు, సిబ్బంది
👉జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులను వదిలేసి క్రిస్మస్ వేడుకల్లో నర్సులు, సిబ్బంది
👉మీడియా రాకను చూసి నృత్యాలు ఆపేసిన సిబ్బంది
👉పేషేంట్ల రూమ్ పక్కనే నృత్యాలు కప్పిపుచ్చే యత్నం చేసిన ఆర్ఎంఓ సుమన్ సిబ్బంది,… pic.twitter.com/WWIXw0IEhk— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024