సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీ తేజ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు కిమ్స్ వైద్యులు. సంధ్య థియేటర్ ఘటన లో గాయపడిన శ్రీ తేజ ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు కిమ్స్ వైద్యులు.
ఇప్పటికీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని వివరించారు. ట్యూబ్ తో శ్రీ తేజ కి ఆహారాన్ని అందిస్తున్నామన్నారు కిమ్స్ వైద్యులు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీ తేజ ఫీవర్ తో బాధ పడుతూ ఉన్నాడన్నారు వైద్యులు. ప్రస్తుతానికి అయితే.. సంధ్య థియేటర్ ఘటన లో గాయపడిన శ్రీ తేజ ఆరోగ్యం విషమంగా ఉందన్నారు.
ఇదిలాఉండగా, అల్లుఅర్జున్‌ను సంధ్య థియేటర్లలో జరిగిన తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఒక రోజు జైలు జీవితం తర్వాత ఆయన విడుదలయ్యారు.