మద్యం సేవించి వాహనం నడిపితే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిసినా, ట్రాఫిక్ విభాగం అవగాహన కల్పిస్తున్నా కొందరు అజాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇతరు ల ప్రాణాలను హరిస్తున్నారు.మద్యం సేవించి వాహనం నడపడం నేరం. అన్ని తెలిసినా కొందరు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సామాన్య వ్యక్తులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాజాగా ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.
మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అక్కడున్న పాదాచారులు కారును పైకి లేపి అందులోని వ్యక్తిని రక్షించారు. కారు డ్రైవర్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.