శ్రీ శైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

-

శ్రీ శైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు పొటెత్తారు.శీతాకాలం ప్రారంభం కావడంతో శని, ఆదివారాల్లో సెలవు దినం కావడం కూడా కలిసొచ్చింది. శనివారం సాయంత్రం భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించుకుని స్వామివారి దర్శనం కోసం వచ్చారు. దీంతో ఆదివారం ఉదయం ఒక్కసారిగా పాతాళగంగ వద్ద భక్తుల తాకిడి పెరిగిపోయింది.

భక్తులు శివయ్యను దర్శించుకునేందుకు క్యూ కట్టారు.దీంతో ఉదయాన్నే శ్రీశైలం క్షేత్రంలో ఉన్న సగానికి పైగా కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోయాయి.ఈ క్రమంలో స్వామి వారి దర్శనానికి దాదాపు 6 గంటల టైం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.కాగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆలయ సిబ్బంది స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news