బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టెకీ సూసైడ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిపై పెదవి విరించింది. ఇప్పుడున్న చట్టాల్లో మార్పులు తేవాలని కోరింది. ఈ కేసును సీరియస్‌గా బెంగళూరు పోలీసులు తాజాగా మృతుడు అతుల్ సుభాష్ భార్యను అరెస్ట్ చేశారు.
అతుల్ సుభాష్ చావుకు ప్రధాన కారణమైన భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా, బావమరిది అనురాగ్‌ను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు.భార్య వేధింపుల కారణంగా బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. తన నుంచి రూ.3 కోట్లకు పైగా భరణం డిమాండ్ చేయడంతో పాటు కేసులు పెట్టి వేధిస్తోందని టెకీ తన నోట్‌లో పేర్కొన్నాడు.