అక్కినేని హీరో నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 8 సుమారు 100 రోజులకు పైగా ప్రేక్షకులకు వినోదం అందించింది. ఈ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఫినాలే జరగనుంది. కాగా ఈ సీజన్ ప్రైజ్‌మనీ రూ. రూ.55 లక్షల నాగార్జున నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్‌తో పాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ తరుణంలోనే… అన్నపూర్ణ స్టూడియో సమీపంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత అనుభవాల దృష్ట్యా అల్లర్లు, గొడవలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. ఆధ్వర్యంలో కొనసాగుతున్న బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇందిరా నగర్, కృష్ణా నగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తినా మీదే బాధ్యత అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.