Australia all out for 445 amid rain delays at Gabba: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో హెడ్ 152, స్మిత్ 101, అలెక్స్ కేరీ 70 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు.. నితీశ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ పడగొట్టారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ కావడంతో వర్షం పడింది. దీంతో కాస్త ఆలస్యంగానే టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. అయితే.. ఆలస్యం గానే టీమిండియా బ్యాటింగ్ చేసినప్పటికీ.. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ , శుభమన్ గిల్ ఇద్దరూ కూడా తొందరగానే ఔట్ అయ్యారు. దీంతో 7 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది.