సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు – మంత్రి ఉత్తమ్ ప్రకటన

-

శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు రాబోతున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. కులగణన సర్వే ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

uttam ration cards

పెద్ద ఎత్తున pds రైస్ అక్రమ రవాణా జరుగుతున్నది వాస్తవం అంటూ ఆగ్రహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడంలేదు. అందుకే సన్నబియ్యం అందజేయాలని చూస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రేషన్ బియ్యం పంపిణీ, వినియోగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సివిల్ సప్లై అధికారులు సమగ్ర విచారణ జరిపి అవసరం లేని వారికి కార్డులను తొలగించి, అవసరం ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news