Pushpa 2 OTT: నెట్‌ ఫ్లిక్స్‌ లోకి వచ్చేస్తున్న పుష్ప 2… స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే ?

-

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప-2 మూవీ నుంచి ఓ అదిరిపోయే న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 9న నెట్‌ ఫ్లిక్స్‌ లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప-2 మూవీ స్ట్రీమింగ్‌ కానుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ వైరల్‌ గా మారింది.

అయితే.. ఈ పోస్టర్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ వైరల్‌ చేస్తున్నారని అంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చేదాక… ఎవరూ నమ్మకూడదని కూడా సినిమా క్రిటిక్స్‌ సూచిస్తున్నారు. కాగా, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప-2 మూవీకి ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. తొలుత మూవీకి డివైట్ టాక్ వచ్చింది. కానీ, ఉత్తర భారతంలో మాత్రం పుష్ప-2 మూవీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 కు వచ్చిన రెస్పాన్స్ కంటే అటు నార్త్ ఇండియాలోనే మూవీకి అత్యధికంగా కలెక్షన్లు వస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news