Anjan Kumar yadav on minister post: నాకు మంత్రి పదవి కావాల్సిందే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేత అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త ‘కుమ్ములాట’ చోటు చేసుకుంది. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. తన కొడుకుకి రాజ్యసభ ఇచ్చాక, తనకు మంత్రి పదవి ఇవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా అంటూ ఫిట్టింగ్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ నేత అంజన్ కుమార్ యాదవ్.
దీంతో ఇదే విషయంపై గాంధీ భవన్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. దీపాదాస్ మున్షీ మాట్లాడుతుండగానే అడ్డుకున్నారు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు. అటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ ముందే గొడవ జరిగింది. ఈ తరుణంలోనే… సమావేశం తర్వాత కూడా గొడవ పడ్డారు కార్యకర్తలు. దీంతో అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారట కాంగ్రెస్ పార్టీ నేత అంజన్ కుమార్ యాదవ్..
కాంగ్రెస్లో మరో కొత్త ‘కుమ్ములాట’
తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్
తన కొడుకుకి రాజ్యసభ ఇచ్చాక, తనకు మంత్రి పదవి ఇవ్వకూడదని రూల్
ఏమైనా ఉందా అంటూ ఫిట్టింగ్ఇదే విషయంపై గాంధీ భవన్‌లో ఘర్షణ
దీపాదాస్ మున్షీ మాట్లాడుతుండగానే అడ్డుకున్న కాంగ్రెస్… pic.twitter.com/aqe3O7KsUo
— Pulse News (@PulseNewsTelugu) December 16, 2024