వైఎస్ఆర్ జిల్లా కడపలో కల్లోలం చోటు చేసుకుంది. 7 గురు కార్పొరేటర్లు, 4 గురు నాయకులు వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యారట. వైఎస్ఆర్ జిల్లా కడప నగరపాలక సంస్థలో ఏడుగురు కార్పొరేటర్లు, నలుగురు పార్టీ నాయకుల సస్పెండ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన 7 మంది కార్పొరేటర్లు, నలుగురు నాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినట్లు చెబుతున్నారు.
వైఎస్ఆర్ జిల్లా కడప నగరపాలక సంస్థ 2వ డివిజన్ కార్పొరేటర్ ఎం.సుబ్బారెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ ఎం. మానస, 6వ డివిజన్ కార్పొరేటర్ నాగేంద్రప్రసాద్, 8వ డివిజన్ కార్పొరేటర్ ఎ. లక్ష్మీదేవి, 32వ డివిజన్ కార్పొరేటర్ ఎస్బీ జఫ్రుల్ల, 42వ డివిజన్ కార్పొరేటర్ సి. స్వప్న,50 డివిజన్ కార్పొరేటర్ కె. అరుణ ప్రభ, పార్టీ నాయకులు ఎం సుదర్శన్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చల్లా రాజశేఖర్, కె.రాజ శేఖర్రెడ్డిలను సస్పెండ్ చేశారు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. త్వరలోనే ఆయా డివిజన్లకు కొత్త ఇన్ చార్జిలను నియమిస్తామని ప్రకటించారని చెబుతున్నారు.