అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. అల్లు అర్జున్ అభిమానులపై కేసులు నమోదు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. సోషల్ మీడియా పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి పై అనుచిత పోస్టులు పెట్టిన కొంతమంది అల్లు అర్జున్ అభిమానుల పై కేసులు నమోదు చేశారు పోలీసులు.
దీంతో అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఇదేం సర్కార్ అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు అల్లు అర్జున్ అభిమానులు. కాగా సంధ్య థియేటర్ సంఘటన లో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా అయ్యారు.
బ్రేకింగ్ న్యూస్
అల్లు అర్జున్ అభిమానులపై కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ పోలీసులు
సోషల్ మీడియా పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఫోకస్
అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత రేవంత్ రెడ్డి పై అనుచిత పోస్టులు పెట్టిన కొంతమంది అల్లు అర్జున్ అభిమానుల పై కేసులు నమోదు చేసిన పోలీసులు pic.twitter.com/bC7QgAQbxj
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024