ప్రస్తుతం ఇంటర్నెట్ రోజువారి జీవితంలో ఒక భాగం అయిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఇంటర్నెట్ తో మన జీవితం కనెక్ట్ అయిపోయింది. ఇంటర్నెట్లో రకరకాల పనుల కోసం రకరకాల సైట్స్ వెతుకుతుంటారు. అయితే 2024 లో ఎక్కువ మంది విసిట్ చేసిన వెబ్ సైట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
గూగుల్.కామ్:
ఈ లిస్టులో గూగుల్ పేరు మొదటి స్థానంలో కచ్చితంగా ఉంటుంది. ప్రతి అవసరం కోసం గూగుల్ లో వెతికేవాళ్లు ఎక్కువమంది కనిపిస్తారు. గూగుల్ ని ఒక నెలలో సగటున 83.1 బిలియన్ మంది విసిట్ చేశారు.
యూట్యూబ్.కామ్:
వీడియోలు చూడటానికి ఎక్కువ మంది ఉపయోగించే యాప్ ఏదైనా ఉందంటే అది యూట్యూబ్ మాత్రమే. సగటున ఒక నెలకు 29.6 బిలియన్ మంది యూట్యూబ్ ని విజిట్ చేశారు.
ఫేస్ బుక్.కామ్:
బ్యాంకులో అకౌంట్ ఉందా లేకపోయినా ఫేస్బుక్లో అకౌంట్ కచ్చితంగా ఉండి తీరుతుంది. ఫేస్బుక్ ని ఒక నెలలో సగటున 12.7 బిలియన్ల మంది దర్శిస్తున్నారు.
ఇంస్టాగ్రామ్.కామ్:
టిక్ టాక్ బ్యాన్ అయినప్పటినుండి ఇంస్టాగ్రామ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది రీల్స్ చేస్తూ మరి కొంతమంది రీల్స్ చూస్తూ ఎక్కువ సమయాన్ని ఇన్స్టా లో గడుపుతున్నారు. సగటున్న ఒక నెలలో 5.9 బిలియన్ల మంది ఇంస్టాగ్రామ్ ని విజిట్ చేస్తున్నారు.
ఎక్స్.కామ్:
ఆలోచనల్ని పంచుకోవడానికి అత్యుత్తమమైన సోషల్ మీడియా వేదిక ఎక్స్ ని సగటున నెలకు 4.7 బిలియన్ మంది దర్శిస్తున్నారు.
వాట్సాప్. కామ్:
వాట్సాప్ అకౌంట్ లేనివాళ్లు దాదాపు ఎవరు ఉండరని చెప్పవచ్చు. సేటును వాట్సాప్ ని 4.5 బిలియన్ మంది దర్శిస్తున్నారు.